సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో సంచలన మార్పులు తీసుకొచ్చింది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే విధంగా రూల్స్‌లో పలు సవరణలు చేసింది.
వివరాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల నిబంధనల్లోని సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో రూల్ 9, రూల్ 25కి సవరణలు చేసింది. ఈ క్రమంలో ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అలాగే, ఐదేళ్లకు మించి నిరంతర గైర్హాజరు అయితే సేవల నుంచి తొలగించే విధంగా సవరణ జరిగింది. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ టూర్ వెళ్లినా చర్యలు తీసుకునే విధంగా మార్పులు చేశారు. అయితే, చర్యలకు ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు తప్పనిసరి అని నిబంధనల్లో పేర్కొన్నారు.


