breaking news
Ice Creams AD
-
ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)
-
బాగా ఎంజాయ్ చేస్తున్నా!
‘‘ఒంటి మీదకు వచ్చిన వయసును దాచేస్తే దాగుతుందా ఏంటి?’’ అంటున్నారు కరీనా కపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 34 ఏళ్ళు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే పేర్కొన్నారు. మగవాళ్ల జీతం... ఆడవాళ్ల వయసు అడగకూడదంటారు కదా? అనే ప్రశ్న కరీనా ముందుంచితే -‘‘నాకా సమస్య లేదు. నేను వయసు చెప్పడానికి రెడీ. దానికెందుకు బాధపడాలి? ఈ వయసులో నేను 16 ఏళ్ల పిల్లలానో, 22 ఏళ్ల యువతిలానో కనిపించాలని ఎందుకు ప్రయత్నించాలి? నేనా దశను బాగా ఎంజాయ్ చేశా. ఇప్పుడీ దశను ఆస్వాదిస్తున్నాను. రేపు ఫార్టీ ప్లస్, ఫిఫ్టీ ప్లస్ వయసును కూడా ఎంజాయ్ చేస్తాను. అంతేకానీ మళ్లీ వెనక్కి వెళ్లి, కుర్రదానిలా కనపడాలని పాకులాడడం ఎందుకు? మీకో విషయం చెప్పనా? నా వయసు 34 కదా! ఈ వయసులో నేను టీనేజ్గాళ్స్ చేసినట్లుగానే ఐస్‌క్రీమ్ యాడ్‌లో నటించా. అది గొప్ప విషయంగా భావిస్తున్నా. థర్టీ ప్లస్‌లో కూడా నేనా ఐస్‌క్రీమ్ యాడ్‌కి సరిపోతానని ఉత్పత్తిదారులు అనుకున్నారే.. దాన్ని నేను ఎచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. సో... నేను చెప్పేదేంటంటే, వయసు మీద పడుతుంది కదా అని దిగులుపడకుండా, మార్పును అంగీకరించాలి’’ అన్నారు.


