‘నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దూ’.. జెన్‌జీ యువతి | Gen Z employee quits on the spot with brutal message after boss humiliates her | Sakshi
Sakshi News home page

‘నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దూ’.. జెన్‌జీ యువతి

May 13 2026 5:50 PM | Updated on May 13 2026 6:40 PM

Gen Z employee quits on the spot with brutal message after boss humiliates her

తాను పనిచేస్తున్న ఓ సంస్థలో తన బాస్‌ తనకి గౌరవం ఇవ్వడం లేదనే కారణంతో ఓ జెన్‌జీ ఉద్యోగానికి రిజైన్‌ చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్పుగా అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే తాను కోరుకున్న దాని కోసం రాజీపడని జెన్‌జీ నేను గర్వపడుతున్నాను’అని వ్యాఖ్యానించింది. 

ఓ జెన్‌జీ ఉద్యోగిని తన బాస్ సమావేశంలో అవమానకరంగా ప్రవర్తించడంతో తీవ్రంగా బాధపడింది. ఆ అవమానం తట్టుకోలేక ఆమె వెంటనే రాజీనామా చేసింది. రాజీనామా అనంతరం తన బాస్‌కి ఓ సందేశం పంపింది. తక్కువ జీతమా? భరించొచ్చు. కానీ అవమానిస్తే అస్సలు ఊరుకోను. గౌరవం లేని వాతావరణంలో పనిచేయడం అసాధ్యం’అని స్పష్టం చేసింది.  

అనంతరం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో  నేను 2 సంవత్సరాలు 7 నెలలు ఒక సంస్థలో విధులు నిర్వహించా. కష్టపడ్డా. తగినట్లు పేరు సంపాదించాను. అదనపు గంటలు పనిచేశారు. అదనపు గంటలకు వేతనం ఇవ్వమంటే మేనేజర్ అందరిముందు నాపై అరిచారు. ఇది సరైన పద్దతి కాదు. క్షమాపణ అడిగాను. 

క్షమాపణలు చెప్పలేదు. అవన్నీ జరగనప్పుడు నేను అదే సంస్థలో ఉద్యోగం ఎందుకు చేయాలి. అందుకే రాజీనామా చేశా. ‘నిజం చెప్పాలంటే, అలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆమె చెప్పింది.

ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక మంది యువత ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ‘ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం’ అని కామెంట్లు చేస్తున్నారు. జెన్‌జీ తరం ఉద్యోగంలో కేవలం జీతం కోసం కాకుండా, గౌరవం, సౌకర్యం, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చ మొదలైంది.

 

Advertisement
 
Advertisement
Advertisement