ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇవి గత నెల 25న ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ద్వితీయ సంవత్సరం పరీక్షతో ముగిశాయి. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పడ్డ విద్యార్థులు ఆటాపాటలతో గడపనున్నారు. చివరి రోజు స్నేహితుల ఫోన్ నంబర్లు తీసుకుంటూ టచ్‌లో ఉండాలంటూ పరీక్ష కేంద్రం నుంచి వెనుదిరిగారు. జిల్లా కేంద్రంలో వసతిగృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్‌లో ఉంటూ చదివిన విద్యార్థులను తీసుకోవడానికి వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు చేరుకున్నారు. విద్యార్థులు సొంత గ్రామాలకు చేరుకోవడానికి బస్టాండ్‌కు తరలివెళ్లడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది.
ఈనెల 15 నుంచి ఇంటర్మీడియెట్ మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆర్‌ఐవో జాదవ్ గణేశ్‌కుమార్ తెలి పారు. మొదటగా తెలుగు, హిందీ, సివిక్స్, గణితం, ఇంగ్లీష్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉంటుందని వివరించారు. జిల్లావ్యాప్తంగా ఈ సారి ఒక్క విద్యార్థి కూడా డిబార్ కా లేదని పేర్కొన్నారు. పరీక్ష చివరి రోజు కావడంతో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని, దోస్త్ యాప్‌లో డిగ్రీ కళా శాలలను ఎంచుకోవాలని సూచించారు. మౌలిక వసతులతోపాటు అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారని వివరించా రు. ఈ ప్రచార కార్యక్రమంలో లెక్చరర్లు సంతోష్ కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


