ఆదిలాబాద్‌టౌన్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారీరక వ్యాయామం, క్రీడలు, వినోదాత్మక కార్యక్రమాలు సిబ్బందికి మానసిక ప్రశాంతతతో పాటు పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెడ్‌క్వార్టర్స్‌లో స్నూకర్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ క్రీడలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ స్వయంగా సిబ్బందితో కలిసి స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, ఏఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


