కై లాస్‌నగర్(బేల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ అన్నారు. బేల మండలంలోని కాప్సి గ్రామంలో బుధవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జ్యోతిభాపూలే గురుకులాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


