ఆదిలాబాద్‌టౌన్: గంజాయిపై జిల్లా పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇది సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించినా కొంత మందిలో మార్పు రావడం లేదు. స్వల్ప వ్యవధిలో ఎక్కువ డబ్బులు సంపాదించా లనే ఆశతో కొందరు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దళారులు సై తం మభ్యపెడుతూ అంతరపంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే పట్టుబడిన సమయంలో రైతులు కేసులపాలవుతున్నారు. పోలీసుల సిఫారసులతో ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. గతంలో కలెక్టర్ ఐదారుగురు రైతుల రైతుబీమా, రైతు భరోసా, ఇతర పథకాలను సైతం నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా గంజాయి సాగు చేస్తున్న రైతుల వివరాలను సైతం అధికారులకు నివేదించారు.
అక్రమ మార్గంలో..
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు చర్యలు చేపడుతుండగా అక్రమార్కులు మా త్రం అమాయక రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ దందా సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లోని వారిని లక్ష్యంగా చేసుకుని అంతర పంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఉట్నూర్, గాదిగూడ, భీంపూర్, బజార్‌హత్నూర్, బోథ్, తాంసి, తలమడుగు, అటవీ ప్రాంతాల్లో ఈ
సాగు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మత్తులో తూగుతూ..
గంజాయికి అలవాటుపడ్డ యువత మత్తులో తూగుతున్నారు. అక్రమార్కులు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో వారికి అంటగడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, ఖుర్షీద్‌నగర్, తిర్పెల్లి, ఖానాపూర్, బస్టాండ్, ఏరోడ్రమ్ తదితర ప్రాంతాల్లో ఈ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల వన్‌టౌన్, టూటౌన్, సీసీఎస్ పోలీసులు విక్రయదారులను పట్టుకుని అరెస్టు చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది తీరులో మార్పు రావడం లేదు. గ్రాము, రెండు గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి రూ.100 నుంచి 300 వరకు అమ్ముతున్నారు.
జిల్లాలో గంజాయి కేసులు,
పట్టుబడిన
సరుకు
సంవత్సరం కేసులు ఎండిన గంజాయి విలువ
2025 190 48.327 కేజీలు (2,264 మొక్కలు) రూ.2కోట్ల 16లక్షలు
2026 32 14.910 కేజీలు (520 మొక్కలు) రూ.55లక్షలు
విభిన్న రీతిలో విక్రయాలు..
గంజాయి విక్రయించేందుకు గాను మహారాష్ట్రకు చెందిన వారు జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల వారిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. రహస్య ప్రదేశాల్లో ప్యాకెట్లను ఉంచుతున్నారు. సరుకు కావాలంటే ముందుగానే వారికి ఓ కోడ్ కేటాయిస్తున్నారు. సదరు వ్యక్తి ఆ కోడ్ చెబితేనే ప్యాకెట్ అందించి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. హోటళ్లు, పాన్‌షాపులు, మైదాన ప్రాంతాల్లో కొంత మంది కూర్చొని వీటిని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం మేరకు అప్పుడప్పుడు పోలీసులు
దాడులు చేస్తున్నారు.
గంజాయి రహిత జిల్లా లక్ష్యం..
జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎవరైనా గంజాయి విక్రయించినా, సాగు చేసినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలి. వాట్సాప్ నంబర్ 8712659973కు సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. గంజాయి సాగు చేసిన 40 మంది రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సిఫార్సు చేశాం. ఇప్పటివరకు 30 మందిపై పరీక్షలు చేసి నిర్ధారణ అనంతరం కేసులు నమోదు చేశాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ
ఇద్దరి అరెస్ట్
గంజాయి సేవిస్తున్న ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలి పారు. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన తోట సాగర్, విద్యానగర్‌కు చెందిన వికేష్ గెజి టెడ్ నం.1 పాఠశాల వెనకాల గంజాయి సే వి స్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద 22 గ్రాముల గంజాయి లభించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


