వంట గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న వ్యక్తిపై కేసు

Mar 11 2026 7:37 AM | Updated on Mar 11 2026 7:37 AM

కైలాస్‌నగర్‌: గృహవసర వంట గ్యాస్‌ సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ ఓ మెకానిక్‌ గ్యారేజీలో ఆటోలు, కార్లకు గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 1న ‘రీఫిల్లింగ్‌ దందా’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్‌ రాజర్షి షా విచారణకు ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మహేశ్‌ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోగల మెకానిక్‌షాపును సందర్శించి విచారణ చేపట్టారు. వంటగ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్‌ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు బాధ్యులైన మెకానిక్‌ షాప్‌ యజమాని పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన షేక్‌ జాబీర్‌, ఆయనకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్న జైనథ్‌ మండలంలోని రుద్ర గ్యాస్‌ ఎజెన్సీ యజమానిపై మంగళవారం 6ఏ కేసు నమోదు చేశారు. వంటగ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా తరలించినా, ఇతర కార్యకలాపాలకు వినియోగించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement