భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు. జాతీయ సైన్స్ దినో త్సవాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా ఆయా పా ఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నిత్యజీవితంలో ఉపయోగపడేలా ఆవిష్కరణ లు తయారు చేసి అందరినీ అబ్బురపరిచారు. పట్టణ సమీపంలోని ఎస్‌ఆర్‌ప్రైమ్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హా జరై మాట్లాడారు. విద్యార్థుల్లో సైన్స్‌పై పరిజ్ఞా నం పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రమోద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బేల జెడ్పీఎస్‌ఎస్‌లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ప్ర భుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కా ర్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


