‘హోలీ మంగళవారమే..’
ఆదిలాబాద్:ఈనెల 3వ తేదీన (మంగళవారం) హోలీ పండుగ నిర్వహించుకో వాలని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రోజున నిండు పూర్ణిమ ఉందని, మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటమే కాకుండా, ఆ రోజు రాత్రి పూర్ణిమ ఉండదని వివరించారు. ఈ శాస్తోక్త్ర కారణాల దృష్ట్యా, సోమవారం కామదహనం నిర్వహించి, మంగళవారం రంగుల పండుగ (హోలీ) జరుపుకోవాలని సూచించారు. ఇందులో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, కోశాధికారి రవీందర్, కార్యనిర్వాహక కార్యదర్శి రవీందర్, నర్సింలు, మహిపాల్, రాజు, అశోక్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సుభాష్ ఉరాడే తదితరులు పాల్గొన్నారు.


