విద్యతో ప్రగతి సాధ్యం
నార్నూర్: విద్యతోనే ప్రగతి సాధ్యపడుతుందని, అలాగే మూఢ నమ్మకాలకు దూరంగా ఉండవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గాదిగూడ మండలంలోని డాబా–బి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో శని వారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హాజరై మాట్లాడారు. గిరి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే నాటు వైద్యానికి దూ రంగా ఉండాలని సూచించారు. ఆదివాసీ యు వత కోసం మార్చి 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని సూచించా రు. అనంతరం 200 మంది గ్రామస్తులకు వై ద్యులు పరీక్షలు ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అ సోసియేషన్ వైద్యులు శరత్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, చంద్రశేఖర్, విజయరాహుల్, ఉట్నూర్ సీఐ ప్రసాద్, గాదిగూడ ఎస్సై ప్రణయ్‌కూమార్, నార్నూర్ ఎస్సైశ్రీసాయి సర్పంచ్ కొడప కన్ను తదితరులు పాల్గొన్నారు.


