ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి

Mar 6 2026 8:32 AM | Updated on Mar 6 2026 8:32 AM

కైలాస్‌నగర్‌: ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చే యాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ము న్సిప ల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమ విజయవంతంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి వార్డుల సందర్శన ప్రారంభమవుతుందని, వార్డుల్లోని సమస్యలు గుర్తించి వాటిని అ క్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 49వార్డులకు సంబంధించిన పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి సమస్య, పెండింగ్‌ ఫైళ్లపై ప్రత్యే క దృష్టి సారించాలని, కాలనీలో నెలకొన్న సమస్యలపై పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ రోహిత్‌, కమిషనర్‌ రాజు, ఆర్వో కళ్యాణ్‌, ఎంఈ అరుణ్‌కుమార్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement