నిరంతరం సాధన చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిరంతరం సాధన చేయాలి

Mar 6 2026 8:31 AM | Updated on Mar 6 2026 8:31 AM

ఆదిలాబాద్‌రూరల్‌: బాలికలు ఉన్నత లక్ష్యాలు చేరుకునేందుకు నిరంతం సాధన చేయాలని అదనపు ఎస్పీ మౌనిక సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘ఇగ్నైట్‌ యువర్‌ డ్రీమ్స్‌’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగ సాధన చాలా శ్రమతో కూడినదైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం మన పాదాల చెంతకు వస్తుందని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించా లని ఆకాంక్షించారు. ఐటీడీఏ ఏటీడీవో నిహా రిక, ప్రధానోపాధ్యాయులు నారాయణరావ్‌, స్వర్ణలత, జిల్లా గిరిజన క్రీడల అధికారి కే పార్థసారథి, ఎస్‌.విజయ్‌బాబు, యోగేశ్వర్‌, డాక్టర్‌ క్రాంతి, కరణ్‌సింగ్‌, కృష్ణారెడ్డి, అశోక్‌, గంగారాం, సునీత తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement