అన్ని మౌలిక వసతులతో.. | - | Sakshi
Sakshi News home page

అన్ని మౌలిక వసతులతో..

Mar 6 2026 8:31 AM | Updated on Mar 6 2026 8:31 AM

మండలానికో పాఠశాల ఏర్పాటు జిల్లాలోని 21 స్కూళ్ల ఎంపిక రూ.కోటితో భవన నిర్మాణం ఆంగ్ల మాధ్యమంలో బోధన నిరుపేదలకు కార్పొరేట్‌ విద్య

ఆదిలాబాద్‌టౌన్‌: పేదలకు మరింత నా ణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మండలానికో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు చే సేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తు తం జిల్లాలోని కొత్త మండలాలు మినహా మిగతా చో ట్ల వీటిని ఏర్పాటు చేయనుంది. ఒక్కచోటే ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశమున్న బడులను గుర్తించారు. మండలానికి ఇతర గ్రామాలకు సమీపంలోని పాఠశాలలను ఎంచుకున్నారు. అయితే, ఈ బడుల్లో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధన సాగనుంది. జూన్‌ నుంచి భవన నిర్మాణాలు చేపట్టే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రెండేళ్లపాటు సాధారణంగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఆ తర్వాత ప్రవేశ పరీక్షల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అన్ని మౌలిక వసతులు, హంగులతో ఈ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా వీటిని ఏర్పాటు చేయనుండగా ఒక్కో పాఠశాల భవన నిర్మాణానికి రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని అధికారులు

పేర్కొంటున్నారు.

ఆంగ్ల మాధ్యమంలో బోధన

ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన జరగనుంది. పాఠశాలల భవన నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఆ పాఠశాలలోని విద్యార్థులను సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న బడిలో చదివే విద్యార్థులు ఈ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌లో చదివే అవకాశం కల్పిస్తారు. తెలుగు మీడియంలో చదువుకోవాలనుకునే వారిని పక్క పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలల ఏర్పాటుతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో ఆరు మోడల్‌ స్కూళ్లు ఉన్నప్పటికీ వీటిలో ఆరోతరగతి నుంచి ప్రవేశాలున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు, అవసరమైతే ఇంటర్‌ కూడా ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలోని ఎంపికై న పాఠశాలలివే..

మండలం పాఠశాల

భీంపూర్‌ యూపీఎస్‌, భీంపూర్‌

జైనథ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, కూర

బేల జెడ్పీహెచ్‌ఎస్‌, సిర్సన్న

గాదిగూడ యూపీఎస్‌, లోకారి(బీ)

నార్నూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, భీంపూర్‌

ఇంద్రవెల్లి జెడ్పీహెచ్‌ఎస్‌, ధనోర(బీ)

గుడిహత్నూర్‌ ప్రభుత్వ పాఠశాల,

గుడిహత్నూర్‌

ఆదిలాబాద్‌రూరల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, భీంసరి

ఆదిలాబాద్‌అర్బన్‌ ప్రభుత్వ బాలికల

పాఠశాల

మావల జెడ్పీహెచ్‌ఎస్‌, మావల

తాంసి జెడ్పీహెచ్‌ఎస్‌, తాంసి(బీ)

తలమడుగు జెడ్పీహెచ్‌ఎస్‌, సుంకిడి

బజార్‌హత్నూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, బజార్‌హత్నూర్‌

బోథ్‌ జెడ్పీఎస్‌ఎస్‌,ఽ దన్నూర్‌(బీ)

నేరడిగొండ జెడ్పీహెచ్‌ఎస్‌, నేరడిగొండ

ఇచ్చోడ జెడ్పీఎస్‌ఎస్‌,

ఉర్దూ మీడియం ఇచ్చోడ

సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్‌, సిరికొండ

ఉట్నూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, శ్యామ్‌పూర్‌

భోరజ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, గిమ్మ(కే)

సాత్నాల జెడ్పీహెచ్‌ఎస్‌, అడ

సొనాల జెడ్పీహెచ్‌ఎస్‌, సొనాల

ఈ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. కంప్యూటర్‌, లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌, ఇతర సౌకర్యాలు ఉండేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ఈ పాఠశాలల్లో విద్యాబోధన చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింటిలో ఇంగ్లిష్‌ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో బోధన జరగడం లేదు. అయితే, ఈ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల్లో మాత్రం పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చేరే విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement