ఆదిలాబాద్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అఖిల్‌మహాజన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అ సోసియేషన్ (ఐఎంఏ) అందజేసిన 37 సీసీ కెమెరా లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులు, డాక్టర్ల సమక్షంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో 24గంటల పర్యవేక్షణతోపాటు నేరాలు, చోరీలు జరగకుండా అరికట్టవచ్చని తెలిపారు. ఒకవేళ చోరీ జరిగినా ఛేదించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలు, వ్యా పార సంస్థలు, సంఘాలు సీసీ కెమెరాల ఏర్పాటు కు ముందుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఆ దిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 250 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో ముగ్గురు సిబ్బంది 24గంటలపాటు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏ ర్పాటు చేసిన కెమెరాలను బస్టాండ్, రైల్వేస్టేషన్, మహాలక్ష్మివాడ, రిమ్స్ ప్రాంగణాల్లో అమర్చినట్లు చెప్పారు. పట్టణంలో నూతనంగా ఎన్నికై న కౌన్సి లర్లు వార్డుల్లో కనీసం 10సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సర్పంచులు కూడా సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసి నేరాలకు అడ్డుకట్టవేయడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతమున్న సీసీ కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ డీఎ స్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సునీల్‌కుమార్, నాగరాజు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సతీశ్, కార్యదర్శి డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్లు రంజిత్, దీపక్ పుష్కర్, విజయసారథి, వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
షీ టీంకు 54 ఫిర్యాదులు
గత నెల జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్ షీటీం బృందానికి 54 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్ మ హాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. 61 సందర్భాల్లో కౌన్సిలింగ్ ద్వారా మహిళలకు సేవలందించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 హాట్‌స్పాట్‌లలో ఆకస్మికంగా తనిఖీ చేసి మహిళలపై వేధింపుల ను అరికట్టడానికి కృషి చేసినట్లు తెలిపారు. జిల్లాలో డబుల్ ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. షీ టీం బృందాన్ని ‘డయల్ 100’ లేదా 8712659953లో సంప్రదించాలని సూచించారు.
10న జాబ్‌మేళా
ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. రెండువేలకు పైగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రూ.13వేల నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. మేళాకు 50కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నట్లు చెప్పారు. యువత చదువు, స్థాయినిబట్టి ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా జీతభత్యాలు ఇస్తారని తెలిపారు. యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్, లింక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.


