జిల్లాలో 99రోజులు నిర్వహణ ఇప్పటికే సిద్ధంగా కార్యాచరణ ఐదు స్థాయిలు.. పది అంశాలు ప్రజాప్రతినిధులు భాగస్వాములు నేడు సన్నాహక సభలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో నేటి నుంచి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రారంభించి 99రోజుల పా టు నిర్వహించనున్నారు. ఐదు స్థాయిల్లో 10 అంశాల ఆధారంగా జూన్ 12 వరకు కార్యక్రమం కొనసాగనుంది. శు క్రవారం మొదటిరోజు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో స న్నాహక సభలు నిర్వహించనుండగా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, మున్సిపల్, సొసైటీల చైర్మ న్లు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొననున్నా రు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులందరి కీ చేరేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 99రోజుల్లో ఆ యా శాఖలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు విస్తృతంగా చేపట్టనున్నారు. ప్రణా ళికశాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరిస్తోంది. ప్రధాన అంశాల వారీగా గ్రామసభల్లో చ ర్చించాల్సిన విషయాలను ప్రభుత్వం రూపొందించింది. మొదటిరోజు రాష్ట్ర గీతంతో ప్రా రంభించి సీఎం వీడియో సందేశాన్ని ప్రదర్శించనున్నారు. సంక్షేమ పథకాలల బ్ధిదారుల అభిప్రాయాలు సేకరించనున్నారు.
బడ్జెట్ ప్రతిపాదన
ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణకు బడ్జెట్ ప్రతిపాదించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు నిధుల కేటాయింపుపై స్పష్టత రాలేదు. గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులకు రూ.10వేల చొప్పున, మండల, మున్సిపాలిటీకి రూ.2లక్షల వరకు, నియోజకవర్గ స్థాయిలో రూ.10లక్షలు, జిల్లా స్థాయిలో రూ.50 లక్షలు కేటాయించనున్నట్లు పొందుపర్చినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు.
పనితీరుకు కొలమానం
99రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యాచరణను అన్ని జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేయాలని ఇటీవలే కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించా రు. అధికారుల పనితీరుకు ఈ కార్యక్రమం కొలమానంగా నిలుస్తుందనడం గమనార్హం. ఇటీవల ఎ న్నికై న సర్పంచులు, కౌన్సిలర్లకు తమ గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టేలా చూడాల్సి ఉంది. జిల్లాలో ప్రతిపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలుండగా వారిని సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బా ధ్యత జిల్లా ఇన్‌చార్జి మంత్రిపై ఉంది. మొదటిరోజు జిల్లాలో మంత్రి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.
ఐదు స్థాయిలు.. షెడ్యూల్
ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో, 16న మండల స్థాయిలో, మే 2న నియోజకవర్గ స్థాయిలో, 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, పరిసరాల పరి శుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోండి (అరైవ్.. అలై వ్), సంక్షేమం, పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్‌కు నో, రైతులు (వ్యవసాయం), విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం మొదలైన అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.


