కై లాస్‌నగర్ (బేల): శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో చేతబడి లాంటి మూఢనమ్మకాలను విశ్వసించి ఆందోళ న చెందవద్దని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్‌రెడ్డి సూచించారు. గురువారం బేల మండల కేంద్రంలోని ఇంద్రానగర్‌లోగల అక్బర్ దుకాణం సమీపంలో గుర్తు తెలి యని వ్యక్తులు మూడు రంగుల అన్నాన్ని పెట్టారు. విషయం సామాజిక మధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అన్నాన్ని స్వయంగా తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఆకతాయిల ప ని అని, ఇలాంటి వాటికి భయపడాల్సిన అవస రం లేదని గ్రామస్తులకు భరోసా కల్పించారు. మండలాధ్యక్షుడు ఉరడే దేవేందర్, కార్యదర్శి బోయర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


