ఉట్నూర్‌ ఏఎస్పీగా రుత్విక్‌ సాయి | - | Sakshi
Sakshi News home page

ఉట్నూర్‌ ఏఎస్పీగా రుత్విక్‌ సాయి

Mar 6 2026 8:31 AM | Updated on Mar 6 2026 8:31 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఉట్నూర్‌ ఏఎస్పీగా రుత్విక్‌ సాయి కొట్టేను నియమిస్తూ డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ను రుత్విక్‌ సాయి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అనంతరం ఉట్నూర్‌ నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఉట్నూర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నూతన ఏఎస్పీకి వివరించారు. వివిధ అంశాలపై చర్చించారు. 2023 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి రుత్విక్‌ సాయి కొట్టే గతంలో వేములవాడ ఏఎస్పీగా విధులు నిర్వహించి బదిలీపై ఉట్నూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement