జయంత్యుత్సవాల్లో ఐక్యత చాటాలి | - | Sakshi
Sakshi News home page

జయంత్యుత్సవాల్లో ఐక్యత చాటాలి

Mar 6 2026 8:32 AM | Updated on Mar 6 2026 8:32 AM

కై లాస్‌నగర్‌(బేల): ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఆదివాసీ పర్ధాన్‌ కుల గురు గోండి ధర్మ గురు హీరా సుకా జ యంత్యుత్సవాలకు అధికసంఖ్యలో హాజరై ఐక్యత చాటాలని రాష్ట్రీయ పర్ధాన్‌ జన్‌జాతి ఉత్తన్‌ సంఘటన్‌ జిల్లా అధ్యక్షుడు మెస్రం శంకర్‌ పిలుపునిచ్చా రు. హీరా సుకా జయంతి ప్రచారంలో భాగంగా గు రువారం బేల మండలంలోని పాఠన్‌, కంగార్‌పూర్‌, గూడ, దహెగాం, కొబ్బాయి, భవాన్‌గూడ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ సర్పంచులను శాలువా లతో సత్కరించి హీరా సుకా చిత్రపటం, ఆహ్వానపత్రం, కరపత్రం అందజేశారు. అనంతరం శంకర్‌ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ పర్ధాన్‌ సమాజ్‌ వెనుకబాటుకు గురవుతోందని తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగానే కాకుండా సంక్షేమంలో వెనుకబడిన ఆదివాసీ పర్ధాన్‌ కులస్తులకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఆదివాసీ పర్ధాన్‌ సర్పంచులు కిశోర్‌, పొచ్చిరాం, గులాబ్‌, ఉత్తన్‌ సంఘటన్‌ మహిళా విభాగం జిల్లా గౌరవాధ్యక్షురాలు మెస్రం సంగీత, ఉపాధ్యక్షురాలు కాంతాబాయి, ఆదిలాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాజేశ్వర్‌, జైనథ్‌ మండలాధ్యక్షుడు కోవా ప్రభాకర్‌, నాయకులు గేడం విఠల్‌, మెస్రం దత్తు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement