మరింత చేరువగా సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

మరింత చేరువగా సంక్షేమ పథకాలు

Mar 6 2026 8:32 AM | Updated on Mar 6 2026 8:32 AM

కైలాస్‌నగర్‌: అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్‌ రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై మండల, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తుల క్రోడీకరణ, అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సూచించారు. వై ద్యం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫి ర్యాదులను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. మండల, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి, అభివృద్ధి ఫలాలు ప్రతీ పేదవా డికి అందేలా చూడాలని సూచించారు. సంక్షేమ ప థకాల అమలులో ఎక్కడా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, నిర్లక్ష్యం చేసే అ ధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. స్థానిక సంస్థల అడిషన ల్‌ కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఆర్డీవో స్రవంతి, జెడ్పీ సీఈవో రవీందర్‌ రాథోడ్‌, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివి ధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement