నిర్మల్: పెన్షనర్‌లను ఇబ్బందికి గురిచేసేలా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, పెన్షనర్‌ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరా రు. కేంద్రం ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలకు వ్యతిరేకంగా చేసిన బిల్లుపై పునరాలోచించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 25న బ్లా క్‌డే నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ అధ్యక్షుడు కాండ్లీకర్ రమేశ్, కార్యదర్శి పూదరి జనార్దన్, యూనిట్ ఆర్థిక కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


