ఆగని దాడులు.. తొలగని దిగులు.. | - | Sakshi
Sakshi News home page

ఆగని దాడులు.. తొలగని దిగులు..

Mar 10 2026 7:27 AM | Updated on Mar 10 2026 7:27 AM

● దుబాయ్‌, అబుదాబి ఎయిర్‌పోర్టులపై ఇరాన్‌ దాడులు ● భయాందోళనలో జిల్లా వలస కార్మికుల కుటుంబాలు ● తాజాగా దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్‌ దాడుల సమాచారం వెలువడటంతో ప్రభుత్వం అప్రమత్తమై భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్‌ జిల్లాకు చెందిన వందల మంది కార్మికులు ప్రస్తుతం సురక్షిత ప్రాంతాల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ● ప్రస్తుతం ప్రత్యక్ష ప్రమాదం ఏదీ లేకపోయినా మనసులో మాత్రం భయం కొనసాగుతుందని అక్కడి కార్మికులు చెబుతున్నారు. మరోవైపు టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రసారమవుతున్న బాంబు దాడుల దశ్యాలను చూసి వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర సలహా కమిటీ ఉపాధ్యక్షులు మంద భీమ్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్‌ దేశాల రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, కార్మికులు సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. వదంతులు నమ్మి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు.

నిర్మల్‌ఖిల్లా: దుబాయ్‌లోని పలుప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్మల్‌ జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దుబాయ్‌, అబుదాబి విమానాశ్రయాలపై డ్రోన్‌ దాడులు జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడి పరిస్థితులపై ఇక్కడి ప్రవాసీల కుటుంబాలు టెన్షన్‌ పడుతున్నాయి. ఇదే సమయంలో తాముంటున్న సమీపప్రాంతాల్లోని కొన్ని బహుళ అంతస్తుల భవనాలపై కూడా డ్రోన్‌ దాడుల ప్రయత్నాలు జరిగాయని వలస కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధులకు వెళ్లకుండా గదుల్లోనే ఉండాల్సి వస్తోందని నిర్మల్‌ రూరల్‌ మండలం రత్నాపూర్‌ కాండ్లి గ్రామానికి చెందిన కాపుకుమ్మరి రవి... ‘సాక్షి’కి వెల్లడించారు. గల్ఫ్‌ దేశాలపై దాడుల వార్తలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎయిర్‌ పోర్టులపై దాడులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement