గుడిహత్నూర్: మండలంలోని చెరువాయికి చెందిన ఆదివాసీ మహిళ మారుబాయి గత నెల 22న రిమ్స్ ఆస్పత్రిలో ప్రసవించింది. రక్తహీనతతో బాధపడుతున్న ఆమె పూర్తి చికిత్స తీసుకోకుండానే ఈ నెల 2న ఇంటికి చేరింది. ఈ క్రమంలో గ్రామ సందర్శనకు వెళ్లిన వైద్యబృందం కదలలేని స్థితిలో ఉన్న మారుబాయిని రిమ్స్‌కు తరలించేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. మండల వైద్యాధికారి శ్యాంసుందర్ ఆమెకు నచ్చజెప్పి రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
మారుబాయిని తీసుకెళ్తున్న వైద్య సిబ్బంది


