‘అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు’
ఆదిలాబాద్: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేకే మాజీ మంత్రి జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులు కొద్దినెలల్లో పూర్తి కాబోతున్నాయని, ఆర్వోబీ, ఆర్యూబీ పనులు జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఆదిలాబాద్‌కు వస్తే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ శశాంక సమక్షంలో జరిగిన సర్వేను దొంగచాటు సర్వే అని ఎలా అంటారని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దా వా వేస్తానని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం తమ ప్రయత్నం ఆగదని స్పష్టం చేశారు. నాయకులు వేదవ్యాస్, లాలా మున్నా, జోగు రవి, సతీశ్, గంట జీవన్, తోకల నరేశ్, దినేశ్ మటోలియ, సాయి, కృష్ణయాదవ్, గటిక క్రాంతికుమార్ తదితరులున్నారు.


