బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Mar 15 2026 1:15 AM | Updated on Mar 15 2026 1:15 AM

● ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. బేల మండలానికి చెందిన పలు గ్రా మాల సర్పంచ్‌లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బీజేపీలో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే గ్రామాల రూపురేఖలను మారుస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అభివృద్ధికి ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో చంపెల్లి సర్పంచ్‌ సోనే రావు, సదల్పూ ర్‌ సర్పంచ్‌ మంగేష్‌, కొబ్బాయి సర్పంచ్‌ సత్యపాల్‌, పిట్‌ గావ్‌ సర్పంచ్‌ భీమ్‌ రావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement