ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక సరస్వతి నగర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ‘లక్ష్యం’ కరదీపికను ఆవిష్కరించి, ‘ఆల్ ఇన్ వన్’ స్టడీ మెటీరియల్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టంగా కాకుండా ఇ ష్టపడి చదవాలన్నారు. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి ఉంటే ‘టెలీమానస్’ హెల్ప్‌లైన్ నంబర్ ద్వా రా సాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్, డీసీఈబి సెక్రెటరీ గజేందర్, సెక్టోరియల్ అధికారులు లక్ష్మణ్, అజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముత్నూర్ పాఠశాల త నిఖీ..
ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్ గురుకుల పా ఠశాలను సందర్శించారు. కిచెన్, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో మాట్లాడారు. చదువుతో పాటు ఆరో గ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, అదనపు వైద్యారోగ్య అధికారి మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థినులున్నారు.
శ్యాంపూర్‌లో మెగా వైద్యశిబిరం
ఉట్నూర్‌రూరల్: మండలంలోని శ్యాంపూర్ పీహెచ్‌సీలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన పలు విభాగాల వైద్యులు పాల్గొని సుమారు 300 మందికి వైద్య పరీక్షలు చేశారు. శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంత రం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీ లించి త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో నరేందర్, అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, ఉట్నూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉపేందర్, శ్యాంపూర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ సందీప్, వైద్య సిబ్బంది ఉన్నారు.
గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కై లాస్‌నగర్: సర్పంచ్‌లు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. డీపీఆర్సీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించి న బోథ్, సోనాల, భీంపూర్, మా వల మండలాల సర్పంచ్‌ల నాలుగో విడత శిక్షణ ముగి సింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అ నంతరం మాట్లాడుతూ,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతీగ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూ చించారు. కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీఎల్‌పీవో ఫణీందర్‌రావు, బోథ్ ఎంపీడీవో రమేశ్, మాస్టర్ ట్రైనర్ మహేశ్, సర్పంచులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా క్రీడా పోటీలు
ఆదిలాబాద్: మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళా ఉద్యోగులకు శనివారం క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూషతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారిలో ఉత్సాహం నింపేందుకు పోటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ క్రీడల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం ఇటీవల నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో గెలుపొందిన విజేతలను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో మిల్కా, మున్సిపల్ కమిషనర్ రాజు, డీవైఎస్‌వో శ్రీనివాస్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వార్డ్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


