ఆదిలాబాద్‌టౌన్: ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి పరీక్షల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే కథనంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజేశ్వర్ స్పందించారు. ‘పైసా వసూల్..’ శీర్షికన సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైంది. అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో స్పందించి ఎంఈవోను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఇచ్చోడ ఎంఈవో బిక్కు నాయక్ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థులు ఎవరైనా డబ్బులు ఇచ్చారనే దానిపై ఆరా తీశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌పై ఆధారపడవద్దని సూచించారు. ఉపాధ్యాయులేవరైనా కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే శాఖాపరంగా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.


