ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేరం జరిగిన చోటకే పోలీసులు వెళ్లి సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఇటీవల 6 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్‌టౌన్‌లో, మావల పోలీస్ స్టేషన్‌లో, తలమడుగు, బోథ్, బేల, భీంపూర్ ఒకటి చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. సంఘటన జరిగిన చోట సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి ల్యాప్‌టాప్‌తో వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని, బాధితులకు ఓ కాపీ అందజేస్తారని వెల్లడించారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.


