● ఏఎస్సైని హెడ్‌కార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై రామయ్యను ఆదిలాబాద్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయడంతోపాటు కానిస్టేబుల్ సిద్ధార్థ, హోంగార్డు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ నుంచి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో వివిధ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులపై వీరు వ్యవహరించే తీరుపై క్రమశిక్షణ రాహిత్యం కింద ఎస్పీ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై ఉట్నూర్ ఎస్సై విజయ్‌ను సంప్రదించగా, సస్పెన్షన్ వేటు వేసింది వాస్తవమేనని తెలిపారు.
పైకాజీనగర్‌లో దొంగల కలకలం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పైకాజీ నగర్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి సంచారం కలకలం రేపింది. స్థా నికంగా నివాసముంటున్న జాడే లక్ష్మీదాస్ నూ తనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద ఈ ఘటన చో టు చేసుకొంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సదరు వ్యక్తి ఇంటి పరిసరాల్లో అనుమానానస్పదంగా తిరుగుతూ సీసీ కెమెరాకు చిక్కాడు. ఇంటి చుట్టుపక్కల పరిస్థితులను గమనించిన ఆ వ్యక్తి కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయం స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.


