కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి

● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాల ని సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎన్‌.రాజ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా జైలులో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జడ్జి ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. మహిళలు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించా రు. జిల్లా జైలు సూపరింటెండెంట్‌ పి.గోపిరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా స్థిరపడాలన్నారు. జైలులో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు మహిళా సిబ్బందిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖైదీలు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్‌ రాథోడ్‌ ప్రకాశ్‌, జవాన్లు జావీద్‌, వేణుగోపాల్‌, సాయికిరణ్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement