ప్రజారోగ్యంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై దృష్టి

Mar 11 2026 7:37 AM | Updated on Mar 11 2026 7:37 AM

ఇంద్రవెల్లి: గ్రామాలాభివృద్ధితో పాటు ప్రజా రోగ్యంపై ప్రజాప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరానికి హాజరై ఎస్‌బీఐ అందించిన వైద్యపరికరాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూఢనమ్మకాలకు దూ రంగా ఉండి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చి నా వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందా లని సూచించారు. అనంతరం మండలంలోని దుబ్బగూడలో వీవో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఐటీడీఏ పీవో యువరాజ్‌ మ ర్మాట్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, డీఆర్డీ వో రవీందర్‌రాథోడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ముఖడే ఉత్తం, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, సర్పంచ్‌ రాథోడ్‌ మోహన్‌సింగ్‌, వైద్యులు పూజతి, వసంత్‌రావ్‌, కాంగ్రెస్‌ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement