ఆదిలాబాద్‌రూరల్:ఈనెల 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదా నంలో నిర్వహించనున్న గోండి ధర్మగురు హీరా సుకా జయంతి వేడుకలకు అందరూ తరలి రావా లని రాష్ట్రీయ జన్‌జాతి పర్ధాన్ ఉత్తన్ సంఘటన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెస్రం శంకర్, గేడం మాధవ్ కోరారు. హోలి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రయాలను కాపాడు తూ భావితరాలకు అందించాలన్నారు. అనంతరం భోరజ్ మండలంలోని రాంపూర్, ఆకో లి, మాజ్రా గ్రామాల్లో పర్యటించారు. కులస్తులకు కర పత్రాలు పంపిణీ చేసి సర్పంచ్‌లకు ఆ హ్వాన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంఘటన్ జాతీయ ముఖ్య సలహాదారుడు సిడాం రాంకిషన్, గోడం లక్ష్మణ్, జిల్లా అధి కార ప్రతినిధి కన్నక విఠల్, ఉపాధ్యక్షుడు దుర్వ ప్రదీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ మెస్రం భా స్కర్, పర్ధాన్ సమాజ్ నాయకులు భూమన్న, దత్తు, అభిమాన్ తదితరులున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు
ఉచిత విద్యుత్
ఆదిలాబాద్‌టౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 780 అంగన్‌వాడీ కేంద్రాలకు కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నా రు. ఆయా కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలు కొనసాగుతున్నాయని, ఇవి పూర్తిగా ఉచితమని వివరించారు. చిన్నారుల కోసం నిర్వహించే ప్రీస్కూల్‌లో కార్యకలాపాలు, పౌష్టికాహార పంపిణీ, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతగానో దోహదం పడుతుందని తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆయా కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


