నత్తనడకన ట్యాంకుల నిర్మాణాలు కొనసా..గుతున్న పైపులైన్ల పనులు ఈ సీజన్‌లోనూ పూర్తి కావడం కష్టమే జిల్లా కేంద్రంలో అమృత్ 2.0 పనుల తీరిది
ఈ ‘సారీ’ కటకటేనా!
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని విలీనకాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్–2.0 పథకం కింద ప్రత్యేక నిధులను విడుదల చేసింది. వీటి ద్వారా ఆయా కాలనీల్లో ట్యాంకుల నిర్మాణంతో పాటు కుళాయిల ద్వారా నీటి సరఫరాకు అవసరమైన పైపులైన్ల ఏర్పాటకు ఆదేశించింది. నిధులు విడుదలై ఏడాది గడిచినా ట్యాంకుల నిర్మాణాలు స్లాబ్ లెవల్ దాటకపోగా, పైపులైన్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వేసవిలోపూ పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో ఈ సీజన్‌లోనూ విలీన కాలనీల్లో తాగునీటి ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. ప్రజలు మళ్లీ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి దాపురించనుంది.
నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేలా..
మావల మేజర్ గ్రామ పంచాయతీలోని రాంనగర్, దస్నాపూర్, సుభాష్‌నగర్, పిట్టలవాడ, కేఆర్‌కేకాలనీ, బాలాజీనగర్, హనుమాన్‌నగర్, 170 సర్వేనంబర్ కాలనీలతో పాటు, బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలోని న్యూ హౌసింగ్‌బోర్డు, కచ్‌కంటి పంచాయతీ పరిధిలోని అటెండర్స్‌కాలనీ, కృష్ణానగర్, అనుకుంట పంచాయతీ కేంద్రంతో పాటు దాని పరిధిలోని బంగారుగూడ, రాంపూర్ గ్రామం 2019లో ఆదిలాబాద్ మున్సిపల్‌లో విలీనమయ్యాయి. దీంతో పట్టణ పరిధిలో జనాభా భారీగా పెరిగింది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్–2.0 పథకం కింద ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.95.05 కోట్ల నిధులు మంజూరు చేసింది. నిధులు వచ్చి ఏడాది దాటినా పనులు మాత్రం ఇంకా బెస్‌మెంట్ స్థాయిలోనే ఉండటం గమనార్హం.
నత్తనడకన పనులు..
విలీనకాలనీల్లో తాగునీటి వసతి కల్పించేలా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వా రా పనుల కార్యాచరణను సిద్ధం చేశా రు. పట్టణంలోని బంగారుగూడ, వా ల్మీకినగర్, పాలిటెక్నిక్ కళాశాల స మీపంలో, కేఆర్‌కే కాలనీ, కుమురంభీంకాలనీ, న్యూ కలెక్టరేట్ సమీపంలో, టైలర్స్‌కాలనీ, మహాలక్ష్మివాడ , ఖుర్షీద్‌నగర్‌లో ఒక్కోటి చొప్పున తొ మ్మిది భారీ రిజర్వాయర్ల(ట్యాంక్)ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఖుర్షీద్‌నగర్‌లోని ట్యాంకు నిర్మాణం ఇప్పటికీ బెస్‌మెంట్‌స్థాయిలోనే ఉంది. మిగతావి స్లాబ్ లెవ ల్ వరకు వచ్చాయి. వచ్చే వర్షాకాలం నాటికి కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆ యా కాలనీల వాసులకు ఈ వేసవిలోనూ బల్దియా ట్యాంకర్లు, చేతిపంపులే దిక్కు కానున్నాయి.
పైపులైన్ పనులదీ అదే పరిస్థితి
ట్యాంకుల నిర్మాణాలే కాదు.. పైపులైన్ల పనుల పరిస్థితి అలాగే ఉంది. మొత్తంగా 124 కిలోమీటర్ల మేర ఈ పైపులైన్ వేయాల్సి ఉంది. ఈ పనుల్లోనూ జాప్యమవుతోంది. ఇప్పటి వరకు 87కిలోమీటర్ల మేర వేసినట్లుగా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. విలీనకాలనీల్లో ఎక్కడ చూసినా పైపులే దర్శనమిస్తున్నాయి. దీనిని పూర్తి చేయాలంటే మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ పైపులైన్లను పూర్తి చేసినా ట్యాంకుల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో నీటి సరఫరా కష్టమే.
నీటి సమస్య తలెత్తనీయం
అమృత్ 2.0 పనుల్లో జాప్యమవుతున్న మాట వాస్తవమే. ట్యాంకుల నిర్మాణాలు కొనసాగుతుండటంతో ఈ సీజన్ నాటికి అవి అందుబాటులోకి వచ్చే అవకాశముండదు. అయితే విలీన కాలనీలతో పా టు పట్టణంలోని ప్రధాన కాలనీల్లో ఎక్కడా నీటి సమస్య రానివ్వం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. లాండసాంగ్వి నుంచి పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. అక్కడ పూడికతీతతో పాటు 24గంటల పాటు నడిచేలా విద్యుత్ మోటర్లను ఏర్పాటు చే స్తాం. అలాగే ట్యాంకర్ల ద్వారానూ నీటిని సరఫరా చేస్తాం.
– అరుణ్‌కుమార్, మున్సిపల్ ఇన్‌చార్జి ఈఈ


