‘లక్ష్యం’ నెరవేరేలా.. | - | Sakshi
Sakshi News home page

‘లక్ష్యం’ నెరవేరేలా..

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

‘లక్ష్యం’ నెరవేరేలా..

‘లక్ష్యం’ నెరవేరేలా..

● ‘పది’ విద్యార్థులకు కలెక్టర్‌ లేఖ ● జిల్లాలో 5,568 మందికి.. ● ఈనెల 4 నుంచి బడుల్లో అందజేత ● విద్యార్థులకు అందించే లేఖలో సిలబస్‌ ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ● ప్రణాళికాబద్ధంగా చదివే విధానం రూపొందించుకోవడం. ● స్టడీ మెటీరియల్‌ ఏవిధంగా చదవాలి. ● భావి జీవితంలో లక్ష్యాలు ఏవిధంగా నెరవేర్చుకోవాలి. ● ఆయా సబ్జెక్టుల్లో ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులు, తోటి స్నేహితులతో ఏవిధంగా చర్చించాలి. ● శారీరక, మానసిక ఆరోగ్య విషయాలపై ప్రతీ విద్యార్థి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ రాజర్షిషా లేఖ ముద్రింపజేసి విద్యార్థులకు అందించనున్నారు. గతేడాది పదో తరగతిలో జిల్లా 97 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష.

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులకు పదో తరగతి తొలిమెట్టు. ఇక్కడ సాధించిన ఫలితాలే భవిష్యత్తులో అన్నింటిలో పరిగణలోకి తీసుకుంటారు. జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కలెక్టర్‌ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి బోధన, మౌలిక వసతులపై ఫోకస్‌ పెంచారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో తరచూ సమీక్షలు నిర్వహించడం వంటివి చేపట్టారు. అలాగే విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు ఇప్పటికే కరదీపికలను అందించారు. ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు షురూ కానున్నాయి. ఈ క్రమంలో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ‘లక్ష్యం’ పేరిట లేఖలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 4న వాటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా పదో తరగతి విద్యార్థులందరికీ అందజేయనున్నారు.

వందశాతం లక్ష్యం సాధన దిశగా..

పదో తరగతిలో జిల్లా విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ‘లక్ష్యం’ పేరిట లేఖలను విడుదల చేయనున్నారు. జిల్లాలో 108 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5,568 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. వీరిలో జెడ్పీ యాజమాన్యంలో 3552 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 783, కేజీబీవీల్లో 688 మంది, మోడల్‌ స్కూళ్లలో 545 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 10,928 మంది టెన్త్‌ పరీక్షలకు హాజరు కానుండగా, మిగతా వారు ప్రైవేట్‌, గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. డీఈవో పరిధిలో పాఠశాలలకు మాత్రం ఈ లేఖలను పంపిణీ చేస్తున్నారు.

లేఖలో ఏముందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement