కల్యాణం.. కమనీయం
పూజలు నిర్వహిస్తున్న ఎంపీ గోడం నగేశ్ దంపతులు
బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన స్వామివారి కల్యోణోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ ఎంపీ గోడం నగేశ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మేకల వెంకన్న, రమణ, నంది నర్సయ్య, ఈశ్వర్, చందు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. – బజార్‌హత్నూర్


