దళిత మహాసభ జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

దళిత మహాసభ జయప్రదం చేయండి

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

దళిత మహాసభ జయప్రదం చేయండి

దళిత మహాసభ జయప్రదం చేయండి

కై లాస్‌నగర్‌: అంబేడ్కర్‌ అభయహస్తం పేరిట దళి తులకు రూ.12లక్షల ఆర్థికసాయం ప్రకటించి అమలు చేయాలని మాదిగ హక్కుల పోరాట సమితి జి ల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెదెల్లి మహేందర్‌, కల్లెపెల్లి రాజు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ప్ర భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 18న హన్మకొండలోని హరిత కాకతీయలో దళిత మహాసభ ని ర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్‌ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభకు సంబందించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చెవేళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జి ల్లాలోని దళితులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు కాంతారావు, కరుణాకర్‌, ఆనంద్‌రావు, రాజన్న, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement