ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాతలు
ఆదిలాబాద్: నవ సమాజాన్ని నిర్మించే గొప్ప అవకాశం ఉపాధ్యాయులకే ఉందని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. పట్టణంలోని శిశుమందిర్‌లో ఆదివారం ఏకలవ్య ఫౌండేషన్ విద్యా వాహిని ఆధ్వర్యంలో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులను చదువుకే పరిమితం చేయకుండా, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలన్నారు. అనంతరం నిస్వార్థంగా సేవలందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సతీష్ దేశ్‌పాండే, దిగంబర్, సీఈఓ మధుకర్, జిల్లా ఇన్‌చార్జి ముత్యం, ఎంఈవోలు ఉదయ్‌కుమార్, వెంకట్రావు, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


