దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: దివ్యాంగుల సమస్యలు పరి ష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జిల్లా అధ్యక్షుడు మెస్రం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆది వారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. దివ్యాంగుల పెన్షన్, ఉపకరణాల కోసం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యా ప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 13 నుంచి హైదరా బాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రిలే దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే 28, 29 తేదీ ల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా విభాగం సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం కార్యదర్శి ఆరీఫా బేగం, ఆశన్న, గంగా రాం, రాధ, పద్మ, జాహ్నవి పాల్గొన్నారు.


