పీఆర్సీ అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
ఆదిలాబాద్‌టౌన్: పీఆర్సీ అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని యాదవ సంఘ భవనంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతినెలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. జీవో 317 బాధితుల కోసం త్వరలో జీవో 190 అమలుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు ఇప్పించడానికి చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు అభిమాన్, గౌరవాధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడె నూర్‌సింగ్, నర్ర నవీన్ యాదవ్, విఠల్ గౌడ్, మోహన్ సింగ్, జాదవ్ ప్రకాశ్, ముజీబ్, సునిల్ తదితరులు పాల్గొన్నారు.


