గోడు విని.. గోస తీర్చండి
కై లాస్‌నగర్: భూ సమస్య పరిష్కరించాలని ఒకరు.. పింఛన్ మంజూరు చేయాలని మరొకరు.. ఉపాధి కల్పించాలని ఇంకొకరు.. ఇలా సమస్యలతో తరలి వచ్చిన వారు కలెక్టర్ రాజర్షి షా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. గోస తీర్చాలని వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి కలెక్టర్ అ ర్జీలు స్వీకరించారు. మండల స్థాయి సమస్యలపై సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న జిల్లాస్థాయి అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా చూడాలన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 87 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..


