అరటి పండ్లు తిని.. అవగాహన కల్పించి | - | Sakshi
Sakshi News home page

అరటి పండ్లు తిని.. అవగాహన కల్పించి

Mar 4 2026 7:33 AM | Updated on Mar 4 2026 7:33 AM

ఆదిలాబాద్‌: చంద్ర గ్రహణం సందర్భంగా సమాజంలో ఉన్న అపోహలు, మూఢ విశ్వాసాలు తొలగించేందుకు జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో గ్రహణ సమయంలో అరటిపండ్లు తింటూ, నీళ్లు తాగుతూ గ్రహణాన్ని వీక్షించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్‌ మాట్లాడుతూ.. సాంకేతికంగా పురగమిస్తున్న తరుణంలోనూ అశాసీ్త్రయంగా వ్యవహరించడం విచారకరమన్నారు. గ్రహణాల వెనుక ఉన్న శాసీ్త్రయ కారణాలు తెలిసినా, విద్యావంతులు సైతం సంకుచితంగా ఆలోచించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు దండనాయక ఉమాకాంత్‌, గౌరవాధ్యక్షులు వీరన్న, ఉదారి నారాయణ, నాయకులు శ్రీధర్‌ బాబు, సంతోష్‌ కుమార్‌, గంగన్న, రాజు, లింగారెడ్డి, నర్సయ్య, ప్రేమ్‌కుమార్‌, గంగయ్య, సంతోష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement