అడవిపందిని వేటాడిన ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అడవిపందిని వేటాడిన ముగ్గురి అరెస్ట్‌

Mar 7 2026 7:34 AM | Updated on Mar 7 2026 7:34 AM

పెంచికల్‌పేట్‌: పెంచికల్‌పేట్‌ శివారులోని పంట చేలలో అడవిపందిని వేటాడిన ముగ్గురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పెంచికల్‌పేట్‌ ఎఫ్‌ఆర్‌వో అనిల్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4న వ్యవసాయ పొలాల సమీపంలో వన్యప్రాణులను వేటాడటానికి విద్యుత్‌ తీగలు అమర్చారనే పక్కా సమాచారంతో అటవీశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. వీరికి వేటకు వినియోగించిన విద్యుత్‌ తీగలు లభించాయి. అనుమానంతో పెంచికల్‌పేట్‌ గ్రామానికి చెందిన అప్పాజి శ్రీనివాస్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా వండిన పంది మాంసం లభించింది. అతడిని అదుపులో తీసుకుని విచారించగా అదే గ్రామానికి చెందిన అప్పాజి బుచ్చన్న, గణపతితో కలిసి వేటాడినట్లు అంగీకరించాడు. నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్‌ అధికారి ఆస్మా, ఎఫ్‌బీవోలు సతీశ్‌, మనోహర్‌, లచ్చన్న, సంగదీప్‌, మహేశ్‌, దినేశ్‌, సిబ్బంది వాజీద్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement