‘కడెం’ తీరాన పురాతన ఆలయం | - | Sakshi
Sakshi News home page

‘కడెం’ తీరాన పురాతన ఆలయం

Mar 7 2026 7:34 AM | Updated on Mar 7 2026 7:34 AM

● తొమ్మిదో శతాబ్దం నాటిదిగా గుర్తింపు

● తొమ్మిదో శతాబ్దం నాటిదిగా గుర్తింపు

రాష్ట్రకూటుల కాలం

నాటి గణపతి విగ్రహం

నరసింహస్వామి భగ్నశిల్పం

కాకతీయుల కాలం

నాటి గణపతి విగ్రహం

చాళుక్యశైలి చామరధారిణి

చాళుక్యశైలి భువన శిల్పం

పురాతన నరసింహస్వామి ఆలయం

కడెం: మండలంలోని గంగాపూర్‌ పంచాయతీ పరి ధి దేవునిగూడెం గ్రామ శివారులో క్రీస్తు శకం తొ మ్మిదో శతాబ్దంలో పురుడు పోసుకున్న పురాతన ఆలయాన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్‌ గుర్తించారు. కడెం నది కుడి వైపున ఎత్తైన కొండపై ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. రాతి దూలాలు, రాతి స్తంభాలు చెల్లాచెదురుగా ప డి ఉన్న ఈ గుడి గర్భాలయం కొంచెం పదిలంగా నే ఉంది. గర్భగుడి, ఆలయ ప్రాంగణం, అక్కడికి కొంత దూరంలోనూ ఆరుబయట ఉన్న విగ్రహాల శైలిని బట్టి ఈ ఆలయం రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలంలోనే కాకుండా కాకతీయు ల అనంతర కాలంలోనూ ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. రాష్ట్రకూటుల శైలికి చెందిన గణపతి విగ్రహం అందంగా శిల్పీకరించబడింది. చాళుక్య శైలికి చెందిన భువనశిల్పం, ఇదే శైలికి చెందిన మ రో గణపతి విగ్రహం, ఏక దేవత అధిష్టాన పీఠం, మరో అధిష్టాన పీఠం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆలయం ఎదుట ఈశాన్య దిశలో ఒక శాసన ఫల కం ఉంది. దాని మీది అక్షరాలు చెరిగిపోయి దాదా పు సమతలంగా కనిపిస్తోంది. ఆలయ ప్రాంగణంలో చెట్టు కింద భగ్నమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, నందులు, సౌందర్యారాధకుల విగ్రహా లున్నాయి. స్థానికులు ఈ గుడిని ప్రస్తుతం లక్ష్మీ న రసింహస్వామి గుడిగానే పిలుస్తున్నారు. కడెం న దీ తీరం దాటి దేవుని గూడ గ్రామ సమీపంలోకి చే రితే ఎడమవైపు ఉండి లేనట్టున్న చిన్న పందిరి కింద నాలుగు విగ్రహాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. కాకతీయుల అనంతర కాల చతుర్భుజ వినాయకుడు, ఇదే కాలానికే చెందిన దుర్గను పోలి న విగ్రహం, అందమైన శిరోజాలంకరణతో చాళు క్య శైలికి చెందిన చా మరధారిణి, నంది ప్రతిమలు దర్శనమి స్తాయి. ఇవి భిన్నం కావడం మూలాన ఆలయం బయట ఉంచి ఉంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలి పారు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ముందు తరాల వారికి రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి చరిత్ర అందించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement