కడెం: మండలంలోని కొండుకూర్ గ్రామానికి చెందిన పెద్ది రాజు (28) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..పెద్ది రాజు గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై గురువారం పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసంనిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లి సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


