లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామస్తులు ఒక్కటై గ్రామంలో నీటి ట్యాంకును బాగు చేసుకున్నారు. మిషన్ భగీరథ నుంచి నీటి ట్యాంక్‌లో నీళ్లు బయటకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన ఔట్ ఫ్లో పైపు పైకి ఉంది. ట్యాంకు శుభ్రపర్చిన ప్రతిసారి అందులో చెత్త, మురుగునీటిని తొలగించడం పంచాయతీ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని సర్పంచ్ ముఖేష్.. ఉపాధి అధికారులకు తెలిపారు. సోమవారం ఉపాధి కూలీలందరూ కలిసి కంకర, సిమెంట్ ట్యాంక్ పైకి తరలించారు. ట్యాంకులో ఔట్ ఫ్లో పైపు వరకు సిమెంట్ వేశారు.
నీటిట్యాంకు పైకి మెటీరియల్
తరలిస్తున్న గ్రామస్తులు


