ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వం అన్నదాతకు ఇచ్చి న హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7నుంచి చేపట్టనున్న రైతుల సంతకాల సేకరణపై పార్టీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులు శనివారం ఇంటింటికి తిరుగుతూ సంతకాలు సేకరిస్తారని చెప్పా రు. కార్యక్రమంలో రౌతు మనోహర్, నాయకులు ప్రహ్లాద్, రాజు, లింగారెడ్డి, నారాయణ, రమేశ్, జగదీశ్, గండ్రత్ రమేశ్, సతీష్ పవార్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


