అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష
కై లాస్‌నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని జిల్లాలో శుక్రవారం నేరడిగొండలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యే క శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆఽ దార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖలు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్ర మ రవాణా, మైనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వి ద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధిదారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత వినియోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొ జ్జు పటేల్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూ ష, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధి కారి అగ్రోస్ ఎండీ రాములు పాల్గొన్నారు.
నేరడిగొండలో వైద్యశిబిరం ప్రారంభం
నేరడిగొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి జూపల్లి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసి న ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ప్రారంభించారు. శిబిరంలో ప్రజలకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంవో శ్రీధర్, డీటీసీవో డాక్టర్ సుమలత, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సద్దాం తదితరులు పాల్గొని వైద్యసేవలు అందించారు. ముందుగా మంత్రికి కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి కార్యకర్తలు రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు.
పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం
కై లాస్‌నగర్(బేల): పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని మంత్రి జూపల్లి అన్నా రు. బేల మండలంలోని డోప్టాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మహాలక్ష్మివాడలో ...
జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష తదితరులు పాల్గొన్నారు.


