చెన్నూర్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని సింగరేణి జీఎం (సివిల్) వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జీఎం నరసింహారావుతో కలిసి శుక్రవారం జైపూర్‌లోని ఎస్టీపీపీని సందర్శించారు. ప్లాంట్‌లో భాగంగా నిర్మించబోయే కూలింగ్ టవర్స్ పనులను పర్యవేక్షించారు. ప నుల వివరాలను బీహెచ్‌ఈఎల్ డైరెక్టర్ మధుకిరణ్, పీఎంపీఎల్, కేపీసీ అధికారులు వివరించారు. ప్లాంటు ప్రస్తుత స్థితిగతులను ఎస్‌ఈ సివిల్ బానోతు రాము డయాగ్రామ్ ద్వారా ఆయనకు తెలియజేశారు. ప్లాంట్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కిరణ్‌బాబు, రాము ఉన్నారు.
యువకుడి అదృశ్యం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల అనిల్(26) అదృశ్యమయ్యారు. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. రాపల్లికి చెందిన అనిల్ వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 10వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. అతని ఆచూకీపై బంధువులు, స్నేహితులతో ఆరా తీసిన దొరకలేదు. అనిల్ సోదరుడు దిలీప్ ఫిర్యాదు మేరకు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒకరి బైండోవర్
దహెగాం: మండలంలోని కర్జి గ్రామానికి చెందిన కాటెల కమలాకర్‌ను శుక్రవారం తహసీల్దార్ మునవార్ షరీఫ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. గ్రామంలో మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నందున సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.


