నార్నూర్: అప్పుడే జన్మించిన శిశువును చూడకుండానే బాలింత మృతి చెందింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఈ ఘట న చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వి వరాలు.. ఉట్నూర్ మండలకేంద్రానికి చెందిన ముంజం మల్లేశ్, రాధ దంపతుల కూతురు హి మబిందు (26)ను నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన బుల్లె భారత్, విజయ్‌మాల దంపతుల కుమారుడు ధమ్మపాల్‌తో గతేడాది పెళ్లి చేశారు. ధమ్మపాల్.. ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. హిమబిందు..నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధి గుంజాల సబ్‌సెంటర్‌లో ఎన్‌హెచ్‌ఎం ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఏడు నెల ల గర్భిణి. గతనెల 3న పురిటి నొప్పులు రావడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. పరీ క్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి రిఫర్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతనెల 14న సాధారణ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె కోమాలోకి వెళ్లగా చికిత్స అందిస్తున్నారు. గతనెల 24న ఫిట్స్ రావడం, అదే రోజు రాత్రి గుండెనొప్పి వచ్చింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. బిడ్డను చూడకుండానే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మృతిపట్ల వైద్యులు, యూని యన్ సంఘాలు సంతాపం ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో
నలుగురికి గాయాలు
ముధోల్: మండల కేంద్రంలోని నయాబాది రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విఠోలితండా నుంచి అవినాష్, అంజలి ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై మహారాష్ట్రలోని కడికి గ్రామానికి వెళ్తున్నారు. బాసర నుంచి భైంసాకు వస్తున్న ఆటో ఢీకొంది. బైక్‌పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు భైంసా ఏరియాసుపత్రికి తరలించారు. నాలుగు నెలల పాప, రెండో కుమార్తెను నిజామాబాద్ ఆసుపత్రికి పంపించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.


