నిర్మల్‌చైన్‌గేట్: గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేయాలని బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. జిల్లాలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో వారి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనులపై దిశా నిర్దేశం చేశారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రాజేందర్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


